Fahadh Faasil | టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా స్టార్ డమ్ ఉన్న మాలీవుడ్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). ఈ టాలెంటెడ్ యాక్టర్ సినిమా సినిమాకు కొత్త కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకొస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటాడని తెలిసిందే. లేటెస్ట్గా పుష్ప 2 ది రూల్‌లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మరోసారి సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేస్తున్నాడు.
ప్రొఫెషనల్‌గా ఫుల్ బిజీగా ఉన్న ఫహద్ ఫాసిల్ సెలబ్రేషన్స్ మూడ్‌లోకి వెళ్లిపోయాడు. తాజాగా వెడ్డింగ్ ఈవెంట్లో సందడి చేశాడు. ఇంతకీ పెళ్లి ఎవరిదేనే కదా మీ డౌటు. ఫహద్ ఫాసిల్ సతీమణి, నటి నజ్రియా నజీమ్ సోదరుడిది. వెడ్డింగ్‌లో వధూవరులతో ఫహద్ ఫాసిల్-నజ్రియా కలిసి దిగిన స్టిల్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం మలయాళంలో రెండు తమిళం, తెలుగు భాషల్లో ఒక్కో సినిమాలో నటిస్తున్నాడు.
#Nazriya’s Younger Brother Marriage Still#Fafa #FahadhFaasil #Pushpa2 #Pushpa3TheRampage pic.twitter.com/mjso7qFR1c
— வேடிக்கை பார்ப்பவன் (@Vedikaiparpavin) December 5, 2024
Tyson Naidu | బర్త్ డే స్పెషల్.. డీజే టిల్లు భామ టైసన్ నాయుడు లుక్ వైరల్
The Girlfriend | రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్‌కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?