Tyson Naidu | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ చిత్రాల్లో ఒకటి టైటిల్ రోల్లో నటిస్తోన్న టైసన్ నాయుడు (Tyson Naidu). భీమ్లానాయక్ ఫేం సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు భామ నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు మేకర్స్.
సూపర్ కూల్ గ్లామరస్ లుక్‌లో మెరిసిపోతున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట–గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన టైసన్ నాయుడు టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ చిత్రంలో బెల్లంకొండ డీఎస్పీగా కనిపించబోతున్నట్టు గ్లింప్స్ హింట్ ఇచ్చేసింది. బెల్లంకొండ పోలీసాఫీసర్‌గా నటించిన రాక్షసుడు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఖాకీ చొక్కా వేసుకోబోతుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
Team #TysonNaidu wishes the alluring beauty @iamnehashetty a very Happy Birthday ✨
Wishing you a wonderful year ahead filled with joy and success ❤🔥@BSaiSreenivas @saagar_chandrak @RaamAchanta #GopiAchanta @Bheemsceciroleo @artkolla @14ReelsPlus pic.twitter.com/GsMDdJsmjM
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 5, 2024
The Girlfriend | రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్‌కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?
They Call Him OG | ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా.. ట్విటర్‌లోకి ఓజీ డైరెక్టర్ గ్రాండ్ ఎంట్రీ