Suchitra Devi: టికెట్ ఇప్పిస్తానని చెప్పి 7 కోట్లు తీసుకున్నారు.. కాంగ్రెస్ నేత సుచిత్రా దేవిపై వేటు
Suchitra Devi: హర్యానా ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుచిత్రా దేవిని .. పార్టీ నుంచి వెలివేశారు. కాంగ్రెస్ పార్టీపై ఆమె అవినీతి ఆరోపణలు చేశారు. బావల్ నియోజకవర్గం నుంచి తనకు అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి .. కాంగ్రెస్ నాయకులు ఏడు కోట్లు తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు.
చండీఘడ్: హర్యానా ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుచిత్రా దేవి(Suchitra Devi)ని .. పార్టీ నుంచి వెలివేశారు. కాంగ్రెస్ పార్టీపై ఆమె అవినీతి ఆరోపణలు చేశారు. బావల్ నియోజకవర్గం నుంచి తనకు అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి .. కాంగ్రెస్ నాయకులు ఏడు కోట్లు తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. ఆ ఆరోపణల నేపథ్యంలో హర్యానా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెరల్ చౌదరీ చర్యలు తీసుకున్నారు. తక్షణమే సుచిత్రా దేవిని పార్టీ నుంచి తొలగించాలని ఆమె ఆదేశించారు. పబ్లిక్గా కాంగ్రెస్ హై కమాండ్ నేతలపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో సుచిత్రను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు మహిళా కాంగ్రెస్ పేర్కొన్నది. అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏడు కోట్లు అడిగినట్లు ఇటీవల సుచిత్రా దేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర వివాదాన్ని సృష్టించాయి. అయితే ఆ ఆరోపణలు నిరాధారమైనవిన, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నట్లు ఉన్నాయని హర్యానా మహిళా కాంగ్రెస్ పేర్కొన్నది. పార్టీలో క్రమశిక్షణ పాటించే నేపథ్యంలో సుచిత్రా దేవిపై చర్యలు తీసుకున్నట్లు మహిళా కాంగ్రెస్ చీఫ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

