అర్వపల్లి ఆగస్టు 10 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, అలాగే జిల్లా నుండి గ్రామస్థాయి వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించాలని మోకు దెబ్బ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జేరిపోతుల లక్ష్మణ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బోయపల్లి రవీందర్ గౌడ్ అన్నారు. సోమవారం అర్వపల్లిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో జాజిరెడ్డిగూడెం సర్పంచ్ బింగి కృష్ణమూర్తి యాదవ్, వార్డు మెంబర్ వెలమకంటి యాదగిరి, నజీర్ గౌడ సంఘ చైర్మన్ కుంభం సోమయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింగ కృష్ణమూర్తి, గౌడ సంఘం నాయకుడు శేఖర్ రాంబాబు పాల్గొన్నారు.