హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నించే గొంతులను అణచివేయలేదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఇప్పటికే రద్దు చేసిన బ్రిటిష్ కాలం నాటి పోలీస్ (ఇన్సైట్మెంట్ టు డిసఫెక్షన్) యాక్ట్ -1922లోని సెక్షన్ 3 కింద నమోదైన కేసుకు సంబంధించి ఆయన సోమవారం సీసీఎస్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పాటలు పెట్టుకుంటున్న తెలంగాణ యువతపై పోలీసు కేసులు పెడుతామని బెదిరించడం, వలస పాలన నాటి చట్టాలను ప్రతిపక్ష నాయకులపై ప్రయోగించడం ద్వారా ప్రజల గొంతును అణచివేసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.