‘హీరోయిన్ కావడం నా డ్రీమ్. ఆ ప్రయత్నంలో ఉండగా ఈ అవకాశం వచ్చింది. ఆడిషన్స్ చేసి నన్ను సెలక్ట్ చేశారు. ఇందులో నాది విలేజ్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ క్యారెక్టర్. తొలి సినిమాలోనే నటనకు అవకాశం ఉన్న పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’ అని నటి దష్విక.కె అన్నారు. దినేష్ తేజ్ సరసన ఆమె నటించిన చిత్రం ‘తత్వం’ మర్డర్ మిస్టరీ నేపథ్య కథాంశంతో రూపొందిన ఈచిత్రానికి అర్జున్ కోల దర్శకుడు. శీమకుర్తి వంశీకృష్ణ, శ్వేత పసుపులేటి నిర్మాతలు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో దష్విక విలేకరులతో మాట్లాడింది. ఇందులోని తన పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయని, కిల్లర్ అన్వేషణలో హీరోకి సపోర్ట్ చేస్తూ ఉంటానని, జనరల్‌గా మలయాళంలో ఇలాంటి కథలు వస్తుంటాయని, తెలుగులో ఈ తరహా కథ రావడం ప్రథమమని, ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇదని కథానాయిక దష్విక పేర్కొన్నారు. దర్శకుడు అర్జున్ క్లారిటీతో సినిమా చేశారని, హీరో దినేష్ యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు చాలా సహకరించారని, సాంకేతికంగా కూడా సిని మా అభినందనీయంగా ఉంటుందని దష్విక తెలిపింది.