Tribunals Bill | ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Tribunals Bill | ట్రిబ్యునళ్ల నియామక ప్రక్రియను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రతిపాదించిన ‘ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు-2026 (Tribunals Amendment bill-2026)’ కు లోక్‌సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. సోమవారం సభలో వివిధ అంశాలపై విపక్షాల నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.
Tribunals Bill : ట్రిబ్యునళ్ల నియామక ప్రక్రియను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రతిపాదించిన ‘ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు-2026 (Tribunals Amendment bill-2026)’ కు లోక్‌సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. సోమవారం సభలో వివిధ అంశాలపై విపక్షాల నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) ఈ బిల్లును సభలో లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ట్రిబ్యునళ్ల నియామకాల్లో పారదర్శకత, స్వతంత్రత, ఏకరూపతను తీసుకురావడంతోపాటు వాటి పనితీరులో సమర్థతను పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ బిల్లు చట్టంగా మారితే దేశంలో ‘నేషనల్ ట్రిబ్యునళ్ల కమిషన్ (National Tribunals Commission)’ ఏర్పాటవుతుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహించే ఈ కమిషన్‌లో ఛైర్‌పర్సన్‌తోపాటు ఇద్దరు న్యాయ, ఇద్దరు సాంకేతిక రంగ నిపుణులు సభ్యులుగా ఉంటారు.
ఈ కొత్త చట్టం ద్వారా ట్రిబ్యునళ్ల నియామకాలు, అర్హతలు, పదవీకాలం, వేతనాలు, సభ్యుల తొలగింపు తదితర అంశాలపై స్పష్టమైన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ బిల్లు తీసుకువచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న 2021 నాటి ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం రద్దవుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
కమ్యూనిటీల్లో నీటి కటకట
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

