హైదరాబాద్ : సైబర్ క్రైం కేసులో అరెస్టు చేయకుండా ఉండడానికి ఫిర్యాదుదారుడు నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు ఆర్ఎస్సైలు ఏసీబీకి ( ACB raids) చిక్కారు.మల్కాగిజిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ సైబర్‌క్రైం పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు ఎస్సైలు ప్రమోద్ గౌడ్ ( RSI Pramod Goud ) , జటావత్ బాబు నాయక్ ( Babu Naik ) సోమవారం రూ. లక్ష లంచం ( Bribe ) తీసుకుంటుండంగా పట్టుబడ్డారు.
ఎల్బీ నగర్ చౌరస్తాలో ఎస్సై జటావత్ బాబు ఈ డబ్బును తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో దాడుల నిర్వహించి పట్టుకున్నారు. లక్ష రూపాయల నగదును పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.
బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎవరైనా విధుల ఉల్లంఘలకు పాల్పడి లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ఏసీబీ శాఖ సూచించింది. సోషల్ మీడియా నంబర్ 9440446106 అనే వాట్సప్ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించింది.