తాండూర్ : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, పట్టణ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిస్కరించాలని టీఎస్ యూటీఎఫ్( UTF) జిల్లా అధ్యక్షుడు చక్రపాణి డిమాండ్ చేశారు. పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన నిర్వహించి తాండూర్ కేజీబీవీ ముందు ధర్నా ( Dharna ) చేపట్టారు.
ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ కేజీబీవీ యూఆర్ఎస్. ఎస్ఎస్ఏ లోని ఉద్యోగ ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందికి కనీస మూల వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు జారీ చేయాలని, కేర్ టేకర్లను నియమించి రాత్రి కాపలా డ్యూటీల నుంచి విముక్తి చేయాలని కోరారు.
మార్చి 16న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలకు ప్రభుత్వ స్పందించకపోతే మార్చి 20న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎసీయూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు లావణ్య, తాండూర్ మండల అధ్యక్షులు దేవదాస్, తాండూర్ కేజీబీవీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాప్, మండల వనరుల కేంద్రం ఉద్యోగులు పాల్గొన్నారు.