Fahadh Faasil | పుష్ప సినిమాతో తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ కొట్టేశాడు మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). ఈ టాలెంటెడ్ యాక్టర్ సినిమా సినిమాకు కొత్త కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకొస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటాడని తెలిసిందే.
సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ.. యాక్టింగ్‌లో వేరియేషన్ చూపిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా పుష్ప 2 ది రూల్‌తో కూడా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. ఈ సీక్వెల్లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేస్తున్నాడు.
కాగా ఓ ఇంటర్వ్యూలోఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు ఫహద్ ఫాసిల్. తన సినిమాల ప్లాన్ గురించి అడిగిన ప్రశ్నకు ఫహద్ ఫాసిల్ స్పందిస్తూ.. ఎలాంటి ప్లాన్, డిస్కషన్ చేయను.. ప్రత్యేకించి ఇలాంటి సినిమా చేయాలనే ఇంటెన్షన్ ఏం లేదు. నేను ఫస్ట్ డే చిత్రీకరణలోనే రీషూట్ చేయడానికి తిరిగి వెళ్లే వ్యక్తిని. నాకు ఎక్జయిటింగ్‌గా అనిపించిందే చేశానంటూ చెప్పుకొచ్చాడు ఫహద్ ఫాసిల్.
ఆవేశం సినిమా గురించి మాట్లాడుతూ.. మొదట జీతూతో చర్చలు షురూ అయ్యాయి. నజ్రియా కూడా దీని గురించి మాట్లాడింది. మేం టైటిల్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రతీ ఒక్కరూ నా నుంచి కొత్తగా ఏదో ఉంటుందని ఆశిస్తారు. ప్రతీ సారి లవ్స్టోరీల గురించి కూడా ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
“I have done only what excited me” – Fahadh Faasil@baradwajrangan #FahadhFaasil #Galattaplus pic.twitter.com/8DZQ9fzUEe
— Galatta Plus (@galattaplusoffl) December 5, 2024
Rashmika Mandanna | రష్మిక మందన్నా ఏంటీ సంగతి..? విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఏఎంబీ మాల్లో..
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?