తిరుమలగిరిసాగర్ తహసీల్దార్‌కు అరెస్ట్ వారెంట్ ?
తిరుమలగిరిసాగర్ మండల తహసీల్దార్ అనిల్‌ను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపర్చాలని నల్లగొండ ఎస్పీకి తెలంగాణ మానవహక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీచేసిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.
హాలియా, మార్చి 8: తిరుమలగిరిసాగర్ మండల తహసీల్దార్ అనిల్‌ను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపర్చాలని నల్లగొండ ఎస్పీకి తెలంగాణ మానవహక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీచేసిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని ఓ విషయమై 18 ఫిబ్రవరి 2026 ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు నివేదిక సమర్పించాలని తిరుమలగిరి సాగర్ తహసీల్దార్‌కు గత ఏడాది డిసెంబర్ 9న షరతులతో కూడిన ఉత్తర్వులను హెచ్ఆర్సీ జారీచేసింది.
కమిషన్ పేర్కొన్న సమయానికి నివేదిక సమర్పించడంలో తహసీల్దార్ విఫలమయ్యారు. దీంతో 13 ఏప్రిల్ 2026 ఉదయం 11 గంటలకు తహసీల్దార్‌ను అరెస్ట్ చేసి కమిషన్ ముందు హాజరుపరచాలని హెచ్ఆర్సీ నల్లగొండ జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఆర్సీ అరెస్ట్ వారెంట్ జారీతో మండలంలోని ప్రభుత్వ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మండలంలోని ఏ వ్యక్తి ..ఏ అంశంపై.. ఎందుకు ఫిర్యాదు చేశాడు, కమిషన్‌కు ఏ నివేదిక అందజేయాలి అనే విషయంలో స్పష్టతలేదని రెవెన్యూశాఖలో పనిచేసే ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్ ఆదేశానుసారంగా ఎస్పీ తహసీల్దార్‌ను అరెస్ట్ చేసి కమిషన్ ముందు హాజరుపరుస్తారా లేక వ్యక్తిగత పూచీకత్తుపై కమిషన్‌కు నివేదిక అందజేస్తారా అన్న విషయం నెలరోజుల్లో తేలనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

