స్థానిక తహసీల్దార్‌కు హెచ్చార్సీ అరెస్టు వారెంటు జారీ చేయడంతో జిల్లా రెవెన్యూ శాఖలో కలకలం రేపింది. దీంతో హెచ్చార్సీ ఆదేశాలను తేలికగా తీసుకోకూడదనే సందేశం అధికారులకు వెళ్లింది.
తిరుమలగిరిసాగర్ మండల తహసీల్దార్ అనిల్‌ను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపర్చాలని నల్లగొండ ఎస్పీకి తెలంగాణ మానవహక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీచేసిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.