Sukumar Daughter | టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్, శ్రీమతి తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu). ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, శేష సింధు రావులు నిర్మాతలు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు.
పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా తెరకెక్కిన ఈ సందేశాత్మక చిత్రంలో నటనకు గాను దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాదా సాహెబ్ ఫాల్కే, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డి అవార్డు అందుకుంది. ఇవే కాకుండా.. 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా, న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివల్లో జ్యూరి బెస్ట్ ఫిలింగా, ఉత్త ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకోగా, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ల్ తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు అవార్డులు అందుకోవడం విశేషం. ఇవి కాకుండా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నుండి ఈ చిత్రానికి ఆహ్వానాలు అందుతున్నాయి.
Ringing in the new year on a special note ✨#GandhiTathaChettu – A heartwarming tale of a young girl who made a difference 🌳
In cinemas January 24th, 2025. Stay tuned for more exciting updates ❤🔥
Featuring #SukritiVeniBandreddi
Written & Directed by @padmamalladi14… pic.twitter.com/0LgIjcHEen— Mythri Movie Makers (@MythriOfficial) January 1, 2025