Bhumana Karunakar Reddy | అది డీప్ ఫేక్ వీడియో కాదు.. బీఆర్ నాయుడి వ్యాఖ్యలపై భూమన కౌంటర్
Bhumana Karunakar Reddy | తనపై డీప్ ఫేక్ వీడియోతో సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అది డీప్ ఫేక్ వీడియో కాదని అన్నారు.
Bhumana Karunakar Reddy | తనపై డీప్ ఫేక్ వీడియోతో సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అది డీప్ ఫేక్ వీడియో కాదని అన్నారు. విచారణ జరిపిస్తే అసలు రంగు బయటపడుతుందని స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుంటే మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయని హెచ్చరించారు.
తాడేపల్లిలో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే హిందువుల హృదయాలు మండిపోతున్నాయని అన్నారు. 94 సంవత్సరాల టీటీడీ పాలకమండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనైతిక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తిని చైర్మన్‌గా నియమించారని ఆరోపించారు. ఈ ఘటన తర్వాత టీటీడీ చైర్మన్ పదవికి మౌనంగా రాజీనామా చేయాల్సింది.. కానీ ఆ నెపాన్ని వైసీపీపై నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వాత్సాయనుడికి వారసుడు ఈ నాయుడు అని అన్నారు. తమ హయాంలో జస్ట్ వాయిస్ బయటకు వస్తేనే పృథ్వీతో రాజీనామా చేయించామని గుర్తుచేశారు.
జగన్, ఆయన కుటుంబంపై బీఆర్ నాయుడు దారుణంగా మాట్లాడారని భూమన తెలిపారు. దీనికి ప్రతిఫలంగా దేవుడే బీఆర్ నాయుడికి శిక్ష వేశారని అన్నారు. ఫొటోలు, వీడియోలు బయటకు రావడం భగవంతుడి శిక్షేనని వ్యాఖ్యానించారు. విజయనగర కాలంలో ప్రధాన అర్చకుడు తప్పుచేస్తే తల నరికేశారని.. పాపాల ఊబిలో చిక్కుకున్న బీఆర్ నాయుడిని చంద్రబాబు ఏం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు భక్తి అనేది ఒక నాటకమే అని అన్నారు. బీఆర్ నాయుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవనానంద స్వామిజీ.. ఓ మహాపురుషా.. దీనిపై స్పందించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ నాయుడు క్రామ క్రీడలు సోషల్‌మీడియా ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన బీఆర్ నాయుడు కాదు.. కామ నాయుడిగా మారాడని వమిర్శించారు. ఆ వీడియోలు ఏఐ అని బీఆర్ నాయుడు చెబుతున్న మాట అబద్దమని స్పష్టం చేశారు. తాను కొంతమంది ఏఐ నిపుణులతో మాట్లాడనని.. ఆ వీడియోలు నిజమైనవేనని వారు చెప్పారని వివరించారు. బీఆర్ నాయుడికి సిగ్గుంటే మౌనంగా రాజీనామా చేసి పక్కకు వెళ్లాలన్నారు. కానీ అలా చేయకపోగా.. తనవర్గపు మీడియా ద్వారా వైసీపీపై ఎదురుదాడి చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. డీప్ ఫేక్ వీడియో అంటూ తప్పించుకుంటే కుదరదని స్పష్టం చేశారు.
కాగా, టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని భూమన చేసిన డిమాండ్‌పై బీఆర్ నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. నన్ను రాజీనామా చేయమనడానికి భూమన ఎవరు అని ప్రశ్నించారు. వాళ్ల స్కామ్‌లు బయటపెడుతున్నందుకే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. డైవర్షన్ చేసేందుకే నాపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

