Vijay | విజయ్ వ్యక్తిగత జీవితంలో కలకలం .. నిన్న భార్య, నేడు కుమారుడు..!
Vijay | తమిళ సినీ పరిశ్రమలో ఇళయ దళపతిగా అపారమైన ప్రజాదరణ సంపాదించిన విజయ్ (విజయ్ జోసెఫ్)కు తమిళనాట ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ తర్వాత కోలీవుడ్‌లో అదే స్థాయి స్టార్‌డమ్‌ను అందుకున్న హీరోగా విజయ్ గుర్తింపు పొందారు. అయితే అటువంటి స్టార్‌డమ్‌ను పక్కనబెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన జీవితంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Vijay | తమిళ సినీ పరిశ్రమలో ఇళయ దళపతిగా అపారమైన ప్రజాదరణ సంపాదించిన విజయ్ (విజయ్ జోసెఫ్)కు తమిళనాట ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ తర్వాత కోలీవుడ్‌లో అదే స్థాయి స్టార్‌డమ్‌ను అందుకున్న హీరోగా విజయ్ గుర్తింపు పొందారు. అయితే అటువంటి స్టార్‌డమ్‌ను పక్కనబెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన జీవితంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి రావడం విజయ్ తీసుకున్న పెద్ద నిర్ణయం. ఈ నిర్ణయం తర్వాత ఆయనపై రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు, వ్యక్తిగత దాడులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే అభిమానులు మాత్రం ఆయన నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.
ఇప్పటికే విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉంటుండగా, ఆయన వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆయన భార్య సంగీత సొర్నలింగం విడాకులు కోరుతూ పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. ఈ వార్తతో కోలీవుడ్‌తో పాటు అభిమాన వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా కుటుంబ సభ్యుల నుంచి స్పష్టత రాలేదు.ఇక తాజా టాక్ ఏంటంటే.. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ సోషల్ మీడియాలో తన తండ్రిని అన్‌ఫాలో చేశాడన్న వార్త వైరల్ అవుతోంది. ఇటీవల దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన జేసన్ సంజయ్‌కు విజయ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో తండ్రినే అన్‌ఫాలో చేయడం కుటుంబంలో అంతర్గత విభేదాలపై అనుమానాలకు తావిస్తోంది.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అధికారిక సమాచారం లేదు. కానీ నెటిజన్లు మాత్రం ఈ అంశాన్ని విస్తృతంగా చర్చిస్తున్నారు. విజయ్ కుటుంబంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అనేది స్పష్టంగా తెలియకపోయినా, వరుసగా వస్తున్న వార్తలు అభిమానులని ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత జీవితంలో మార్పులతో విజయ్ ఇబ్బందులకి గురవుతాడా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే విజయ్ తన రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు జేసన్ సంజయ్ కూడా దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ విషయాలపై స్పష్టత ఎప్పుడు వస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- family
- Jason
- jason sanjay
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

