Madha Gaja Raja | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ విశాల్ (Vishal). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విశాల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. విశాల్ నటించిన చిత్రాల్లో ఒకటి మదగజరాజ (Madha Gaja Raja).
యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ చిత్రాన్ని సుందర్ సీ డైరెక్ట్ చేశాడు. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. సంతానం, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. 2013 పొంగళ్ కానుకగా జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడ్డది. 12 ఏండ్ల లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది.
జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. అజిత్‌కుమార్ నటించిన విదాముయార్చి సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో విశాల్ టీం ఈ నిర్ణయం తీసుకుందట. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ సంగీతం అందించాడు. మరి దశాబ్ధం తర్వాత థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్