Bellamkonda Sreenivas | టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ యంగ్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి BSS12. మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేశ్ చందు తెరకెక్కిస్తున్నారు. కాగా నేడు బెల్లంకొండ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ ఒకటి షేర్ చేశారు.
కొండపైన అటవీ ప్రాంతంలో గాలులు, మంటల మధ్య రైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న లుక్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. త్వరలోనే బిగ్ స్క్రీన్‌పై హై ఆక్టేన్ ఎక్స్‌పీరియన్స్‌ను ఫీల్ అయ్యేందుకు రెడీగా ఉండండి.. అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఈ మూవీలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఇప్పటికే సంయుక్తా మీనన్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన స్టైలిష్, ట్రెండీ లుక్ విడుదల చేశారు. సంయుక్తా మీనన్ ఇందులో సమీర పాత్రలో నటిస్తోంది.ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
Amidst blazing fire and winds..
He’s ready to ride and push every limit 🔥Team #BSS12 sends fierce birthday wishes to @BSaiSreenivas ❤️🔥
A high octane experience awaits on the big screens soon! 💥
#HBDBellamkondaSaiSreenivas @iamsamyuktha_ #MaheshChandu @saishashank4u… pic.twitter.com/2lgtxkjErY
— BA Raju’s Team (@baraju_SuperHit) January 3, 2025
VidaaMuyarchi | రెండు తేదీలపై అజిత్ కుమార్ టీం ఫోకస్.. విదాముయార్చి ఏ డేట్‌కు రిలీజయ్యేనో..?
Mega family | జంగిల్లో మెగా ఫ్యామిలీ న్యూఇయర్ అడ్వెంచర్.. ఇంతకీ వీళ్లంతా ఎక్కడికెళ్లారో తెలుసా..?