VidaaMuyarchi | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) వరుస సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో ఒకటి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న విదాముయార్చి (Vidaa Muyarchi). ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ మూవీలో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ సినిమా విడుదల తేదీపై ఏదో ఒక న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తున్నా మేకర్స్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన బయటకు రావడం లేదు. ఈ చిత్రం పొంగళ్ కానుకగా రాబోతుందంటూ వార్తలు వచ్చినా పుకార్లుగానే మిగిలిపోయాయి.
తాజాగా విదాముయార్చి రిలీజ్‌పై ఆసక్తికర న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో రౌండప్ చేస్తోంది. మేకర్స్ ఈ చిత్రానికి రెండు విడుదల తేదీలను పరిశీలిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. తాజా వార్తల ప్రకారం ఈ మూవీని జనవరి 31న కానీ లేదా ఫిబ్రవరి 7న కానీ విడుదల చేయాలనుకుంటున్నారని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మరి మేకర్స్ ఈ రెండింటిలో ఏదో ఒక డేట్‌ను ఫైనల్ చేస్తారా..? లేదంటే మరో తేదీని ప్రకటిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కీలక పాత్రలో నటిస్తుండగా.. రెజీనా కసాండ్రా మరో కీ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విదాముయార్చి నుంచి షేర్ చేసిన పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో ఆరవ్ కీ రోల్లో నటిస్తున్నాడు. అజిత్ కుమార్ దీంతోపాటు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో ఏకే 63 కూడా చేస్తున్నాడని తెలిసిందే. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
SSMB 29 | అడ్వెంచర్‌కు అంతా సిద్ధం.. నేడు రాజమౌళి, మహేష్ సినిమాకు కొబ్బరికాయ!