ఐకార్ ఐఐఎస్డబ్ల్యూసీలో ఉద్యోగాల భర్తీ
ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్(ఐఐఎస్‌డబ్ల్యూసీ) యంగ్ ప్రొఫెషనల్-2, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఐకార్ దరఖాస్తులు ఆహ్వానించింది.
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్(ఐఐఎస్‌డబ్ల్యూసీ) యంగ్ ప్రొఫెషనల్-2, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఐకార్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంట ర్వ్యూ పద్ధతిలో డైరెక్టుగా చేసే ఈ ఉద్యోగాలకు ఎంఎస్సీ, బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు, ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుకు వ్యవసాయం, సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 21 ఏండ్ల నుంచి 50 ఏండ్ల మధ్య వయస్సు వారు అర్హులని పేర్కొన్నది. పూర్తి వివరాలను www.cswcrtiweb.org ఆన్లైన్ ద్వారా సమర్పించాలని, 30న ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు చేపడుతామని ఐకార్ అధికారులు తెలిపారు.
ఇంకా చదవలిసిన వార్తలు
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల మెరిట్ లిస్టు విడుదల
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మంగళవారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్బీ) విడుదల చేసింది. ఈ నెల 12, 13న వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపింది. అవివరాలకు https://mhsrb. telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.
చేనేత ఎన్నికలు నిర్వహించాలి : సీతారాములు
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): చేనేత పారిశ్రామిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, వాటికి క్వాష్ క్రెడిట్ రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్, కార్యదర్శి గంజి మురళితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

