ముస్తాబాద్, మార్చి 10 : బతుకు దెరువు కోసం గంపెడాశతో గల్ఫ్ దేశం వెళ్లిన ఓ వలస కార్మికుడు అక్కడ ఉపాధి లేక మనోవేదనతో మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉ న్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా శివారు బట్టువానితాళ్లకు చెందిన రాగం దేవయ్య – మంజుల దంపతుల కొడుకు రాగం ప్రశాంత్ (28) రెండేండ్ల క్రితం అప్పు చేసి మసట్ వెళ్లాడు.
ఆరు నెలల నుంచి పనులు లేకపోవడం.. ఇటీవల గల్ఫ్‌లో నెలకొన్న పరిస్థితులతో మనోవేదనతో ఉన్న ప్రశాంత్ సోమవారం మృతిచెందినట్టు సహచరుల ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ప్రభుత్వం స్పందించి తమ కొడుకు మృతదేహాన్ని త్వరగా తెప్పించే ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మృతుడికి భార్య స్రవంతి, కూతురు ఉన్నారు.