Mega Family | ఏదైనా స్పెషల్ మూమెంట్ వచ్చిందంటే చాలు మెగా ఫ్యామిలీ (Mega Family) అంతా ఒక్క చోట చేరి సందడి చేస్తూ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొత్త సంవత్సరం (2025)లోకి అడుగుపెట్టిన వేళ అలాంటి సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ స్టార్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ సారి న్యూ ఇయర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకున్నారు. వరుణ్‌తేజ్ (Varun tej)-లావణ్య త్రిపాఠి (Lavanya tripathi) కపుల్తోపాటు నిహారికా కొణిదెల, సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల ఈ ట్రిప్ వేసుకున్నారు.
ఇంతకీ వీళ్లంతా ఎక్కడికెళ్లారనే కదా మీ డౌటు. మహారాష్ట్రలోని తిపేశ్వర్ వైల్డ్‌లైఫ్ సాంక్చుయరీకి వెళ్లారు. వరుణ్‌తేజ్ అండ్ టీం సఫారీ రైడ్‌లో జంగిల్ అంతా చక్కర్లు కొట్టారు. సాంక్చుయరీ అందాలను తమ కెమెరాల్లో బంధించేశారు. అక్కడే కాటేజీలు బుక్ చేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
లావణ్య త్రిపాఠి న్యూఇయర్ అడ్వెంచర్ రైడ్ ఫొటోలు షేర్ చేస్తూ.. తిపేశ్వర్ అడవి ఒడిలో నూతన సంవత్సరం నాకు జీవిత మనుగడకు సంబంధించిన నిజమైన సారాంశాన్ని నేర్పింది. అడవి గుండా పులి కదలికలను చూస్తూ.. నాదైన మార్గంలో పనులు చేసేలా శక్తిని స్వీకరించడం నేర్చుకున్నా. అత్యంత ముఖ్యమైన వాటిని రక్షిస్తూ.. ఈ ఏడాది నేను ఒక ఆడ పులిలాగా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాను. భయం లేని.. క్షమాపణ లేని.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జంగిల్లో న్యూఇయర్ అడ్వెంచర్ ఇలా..
SSMB 29 | అడ్వెంచర్‌కు అంతా సిద్ధం.. నేడు రాజమౌళి, మహేష్ సినిమాకు కొబ్బరికాయ!