Akshay Kumar Sky Force trailer | గతేడాది ‘బడే మియా ఛోటే మియా’, ‘సర్ఫిరా’, ‘ఖేల్ ఖేల్ మే’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరో క్రేజీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’.
ఈ సినిమాతో వీర్ పహరియా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుండగా.. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే భారత దేశ మొదటి వైమానిక దాడి ఆధారంగా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ బ్యానర్లపై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.