మెగా నటికి వేధింపులు
తన వ్యక్తిత్వాన్ని.. తన కుటుంబాన్ని కించపరిచేలా ఇన్‌స్టాలో పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నటి లావణ్యత్రిపాఠి కొణిదెల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పర్పుల్ క్రెయాన్00 పేరుతో ఉన్న ఇన్‌స్టాఖాతా ద్వారా తనపై, తన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని పలు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని.. ఇందులో చాలా అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటూ ఆమె వాపోయారు.
- సైబర్‌క్రైమ్ పీఎస్‌ను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి
సిటీబ్యూరో, మార్చ్ 10(నమస్తే తెలంగాణ): తన వ్యక్తిత్వాన్ని.. తన కుటుంబాన్ని కించపరిచేలా ఇన్‌స్టాలో పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నటి లావణ్యత్రిపాఠి కొణిదెల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పర్పుల్ క్రెయాన్00 పేరుతో ఉన్న ఇన్‌స్టాఖాతా ద్వారా తనపై, తన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని పలు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని.. ఇందులో చాలా అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటూ ఆమె వాపోయారు.
సంబంధిత ఇన్‌స్టా ఖాతా నడుపుతున్న వ్యక్తిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఖాతాలో తనపై చేసిన పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని లావణ్య పోలీసులను కోరారు. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు సంబంధించిన ఐపీ అడ్రస్, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

