ITBP | 282 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ITBP | కేంద్ర సాయుధ దళాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలి.
ITBP | సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ), అస్సాం రైఫిల్స్‌లో 282 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడులైంది. ఈ నోటిఫికేషన్‌ను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) విడుదల చేసింది. వీటికి ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు
మెడికల్ ఆఫీసర్ (అసిస్టెంట్ కమాండెంట్) 115, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్) 162, సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్ ఇన్ కమాండ్) 5 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ అండ్ అబ్స్టెట్రిక్స్, అనస్థీషియా, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ విభాగాల్లో ఉన్నాయి.
అర్హతలు
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత కోర్సులో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. వయసు 30 నుంచి 50 ఏండ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం ఆయా కేటగిరీల వారికి వయోసడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 400, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్మెన్లకు ఫీజు లేదు.
ఎంపిక
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ (200 మార్కులు), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (లెవల్-12)కు రూ. 78,000-2,09,200, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (లెవల్-11)కు రూ. 67,700-2,08,700, మెడికల్ ఆఫీసర్ (లెవల్-10)కు రూ. 56,100-1,77,500 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తులకు చివరితేదీ సెప్టెంబర్ 8. ఇతర వివరాలకు వెబ్సైట్ www.recruitment.itbpolice.inలో చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

