Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతారకు చెందిన డాక్యుమెంటరీ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్రముఖి నిర్మాతలు (Chandramukhi Producers) నయన్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారంటూ నిన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండా ‘చంద్రముఖి’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను వాడుకున్నందుకు నయన్ సహా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు రూ.5 కోట్లు చెల్లించాలంటూ లీగల్ నోటీసులు జారీ చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఈ వార్తలపై ‘చంద్రముఖి’ సినీ నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ (Sivaji Productions) తాజాగా స్పందించింది.
నయన్‌కు తాము ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని సదరు నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సినిమాలోని సన్నివేశాలను తమ పర్మిషన్ తీసుకొనే వినియోగించుకున్నారని స్పష్టం చేసింది. మొత్తం 17 సెకన్ల సన్నివేశాలను రౌడీ పిక్చర్స్ సంస్థ వాడుకోవచ్చని, దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ మేరకు గతేడాది నవంబర్‌లో జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను మీడియాకు విడుదల చేసింది. ఈ ఎన్వోసీని మనోబాల విజయబాలన్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
Chandramukhi team claiming ₹5⃣ cr compensation from Nayanthara netflix documentary is UNTRUE✖️ pic.twitter.com/FD7VfdCc4X
— Manobala Vijayabalan (@ManobalaV) January 6, 2025
కాగా, ఈ డాక్యుమెంటరీ విషయంలో ఇప్పటికే నయన్ తమిళ స్టార్ ధనుష్ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు.
ఆ క్లిప్పింగ్‌ను డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ధనుష్‌ని లక్ష్యంగా చేసుకొని నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. చట్టపరంగా తేల్చుకుంటానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ధనుష్ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వివాదం ముగియకముందే నయన్‌కు చంద్రముఖి నిర్మాతలు కూడా లీగల్ నోటీసులు జారీ చేశారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇందుకు గానూ సదరు నిర్మాణ సంస్థ రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. దీంతో మరో లీగల్ వివాదంలో నయన్ చిక్కుకుందంటూ తెగ ప్రచారం జరిగింది. అయితే, శివాజీ నిర్మాణ సంస్థ క్లారిటీతో ఈ ప్రచారానికి చెక్ పడినట్లైంది.
Also Read..
Nayanthara | నయనతారకు మరో షాక్.. చంద్రముఖి నిర్మాతలు నోటీసులు
“Nayanthara | ధనుష్‌తో వివాదం.. నయనతారకు మద్రాసు హైకోర్టు నోటీసులు”
“Nayanthara | నేనెందుకు భయపడాలి..?.. ధనుష్‌తో వివాదంపై నయనతార కామెంట్స్”
“Nayanthara | వడ్డీతో సహా తిరిగొస్తుంది.. ధనుష్‌ను ఉద్దేశించి నయనతార పోస్ట్!”
“Nayanthara | ఎలాంటి ఉల్లంఘనా జరగలేదు.. ధనుష్ లీగల్ నోటీసులపై స్పందించిన నయనతార లాయర్”
“Dhanush | డాక్యుమెంటరీ వివాదంపై కోర్టును ఆశ్రయించిన ధనుష్.. నయన్ దంపతులపై దావా”
“Dhanush | నయనతారతో వివాదం తర్వాత ధనుష్ తొలి పోస్ట్..! ఇంతకీ ఏమన్నారంటే..?”