Dhanush | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara).. తమిళ స్టార్ ధనుష్ (Dhanush) మధ్య వివాదం మరింత ముదురుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న నయన్ డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ వెనక్కి తగ్గడం లేదు.
ఈ డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారంటూ రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్ ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ధనుష్ కోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా నేను రౌడీనే సినిమా విజువల్స్‌ను వాడుకున్నారని ధనుష్ నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ మద్రాస్ హైకోర్టు (Madras High Court)లో దావా వేసింది. నయన్ దంపతులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌పై కూడా దావా వేసింది. ధనుష్ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. విచారణకు అంగీకరించింది.
కాగా, నయన్.. ధనుష్ మధ్య గతకొంత కాలంగా వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు. ఆ క్లిప్పింగ్‌ను డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ధనుష్‌ని లక్ష్యంగా చేసుకొని నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. చట్టపరంగా తేల్చుకుంటానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ధనుష్ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
Keerthy Suresh | 15 ఏళ్లుగా ప్రేమ అంటూ.. కాబోయే భర్తను పరిచయం చేసిన కీర్తి సురేశ్
Samantha | అప్పుడే మయోసైటిస్ లక్షణాలు బయటపడ్డాయి : సమంత