Zainab Ravdjee | అక్కినేని వారి చిన్న కోడలి బ్యాగ్రౌండ్ పెద్దదే.. జైనబ్ రవ్జీ గురించి ఆసక్తికర విషయాలు
Zainab Ravdjee | యువ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన నిశ్చితార్థం జైనబ్ రవ్జీ (Zainab Ravdjee)తో జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..
Zainab Ravdjee | యువ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన నిశ్చితార్థం జైనబ్ రవ్జీ (Zainab Ravdjee)తో జరిగింది. ఈ విషయాన్ని అఖిల్ తండ్రి, అగ్ర నటుడు నాగార్జున మంగళవారం తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే, ప్రస్తుతం అక్కినేని ఇంటికి కాబోయే కోడలు జైనబ్ గురించి తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఆమె ఎవరు..? బ్యాగ్రౌండ్ ఏంటి..? అంటూ నెటిజన్లు, అక్కినేని అభిమానునలు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..
సోషల్ మీడియా కథనాలు, టాలీవుడ్ సర్కిల్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. 27 ఏళ్ల జైనబ్‌కు చాలా పెద్ద బ్యాగ్రౌండే ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో పుట్టిన జైనబ్ రవ్జీ ముంబైలో స్థిరపడినట్లు సమాచారం. ఆమెకు చిత్రకారిణి, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మంచి పేరుంది. మన దేశంలోనే కాకుండా దుబాయ్, లండన్‌లోనూ ప్రదర్శనలిచ్చినట్లు తెలిసింది. అంతేకాదు.. ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వంలో ‘మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ థ్రీ సిటీస్’ సినిమాలో కూడా జైనబ్ రవ్జీ యాక్ట్ చేశారు. ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు, కునాల్ కపూర్ నటించారు. పెయింటర్‌గా మంచి పేరున్నా.. జైనబ్ రవ్జీ చాలా లో-ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తుంటారు.
ఇక ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ (Zulfi Ravdjee) రియల్ ఎస్టేట్ టైకూన్. ఈ రంగంలో ఆయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది. అంతేకాదు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ముఖ్య సలహాదారునిగా పనిచేశారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు AP ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించారు. అఖిల్‌తో జైనబ్ ఎంగేజ్మెంట్ వేళ.. జుల్ఫీ రవ్జీని నవంబర్ 13, 2019న ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇప్పుడు వైరల్‌గా మారింది.
జుల్ఫీ రైవ్జీ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంత పేరు ప్రఖ్యాతలున్నాయో.. గల్ఫ్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో జుల్ఫీ రవ్జీకి అంత పేరుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్‌గా ఆయన పేరుగాంచారు. ఇక నాగార్జున, జుల్ఫీ రవ్జీకి కొన్నేళ్లుగా స్నేహ బంధం కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ స్నేహానికి తోడు అఖిల్-జైనబ్ మధ్య ప్రేమ ఈ రెండు కుటుంబాలను మరింత దగ్గర చేయబోతోంది. ఇక నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం డిసెంబర్ 4వ తేదీన అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. వీరి వివాహం అయిన తర్వాత ఓ మంచి ముహూర్తం చూసి అఖిల్ – జైనబ్ పెళ్లి కూడా చేయాలని అక్కినేని కుటుంబం భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read..
Keerthy Suresh | 15 ఏళ్లుగా ప్రేమ అంటూ.. కాబోయే భర్తను పరిచయం చేసిన కీర్తి సురేశ్
Naga Chaitanya – Sobhita | నయన్ బాటలో నాగచైతన్య-శోభిత.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న టీమ్
Samantha | అప్పుడే మయోసైటిస్ లక్షణాలు బయటపడ్డాయి : సమంత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

