Naga Chaitanya – Sobhita | నయన్ బాటలో నాగచైతన్య-శోభిత.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న టీమ్
Naga Chaitanya - Sobhita | నాగచైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) వివాహం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ (OTT platform) నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నదని.. స్ట్రీమింగ్ హక్కులను రూ.50 కోట్లకు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వార్తలపై నాగచైతన్య టీమ్ తాజాగా స్పందించింది.
Naga Chaitanya – Sobhita | టాలీవుడ్ నటుడు నాగచైతన్య (Naga Chaitanya) త్వరలోనే మరోసారి వివాహం చేసుకోనున్నారు. నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala)ను మనువాడనున్నాడు. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకోబోతున్నారు. అయితే, వీరి వివాహాన్ని డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వివాహం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ (OTT platform) నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నదని.. స్ట్రీమింగ్ హక్కులను రూ.50 కోట్లకు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వార్తలపై నాగచైతన్య టీమ్ తాజాగా స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టతనిచ్చింది.
డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన సెట్లో సంప్రదాయబద్దంగా పెళ్లి నిర్వహించనున్నట్లు అక్కినేని నాగార్జున ఇప్పటికే ప్రకటించారు. పెళ్లి పనులను శోభిత, నాగ చైతన్యనే దగ్గరుండి చూసుకుంటున్నారని తెలిపారు. ఇక వివాహ వేడుకకు బంధువులతో పాటు సినిమా, రాజకీయ ప్రముఖులను 300 మందిని ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. నాగచైతన్య-శోభిత పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం తనకెంతో ఆనందంగా ఉందని, ఇది కేవలం స్టూడియో మాత్రమే కాదన్న నాగార్జున.. తమ కుటుంబ వారసత్వంలో ఒక భాగమని పేర్కొన్నారు. స్టూడియో తన తండ్రి.. అక్కినేని నాగేశ్వరరావుకి ఎంతో ఇష్టమైన ప్రదేశమని తెలిపారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరినట్లు నాగార్జున పేర్కొన్నారు. సంప్రదాయ తెలుగు పద్ధతిలో పెళ్లి చేస్తున్నట్లు చెప్పారు. ఇక పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు.
Also Read..
Actor Subbaraju | పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

