Actor Subbaraju | పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా..?
Actor Subbaraju | టాలీవుడ్లో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఇటీవల పలువురు స్టార్ బ్యాచిలర్ లైఫ్‌కు వీడ్కోలు చెబుతూ.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా టాలీవుడ్ నటుడు పెనుమత్స సుబ్బరాజు సంతోష్ సైతం సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Actor Subbaraju | టాలీవుడ్లో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఇటీవల పలువురు స్టార్ బ్యాచిలర్ లైఫ్‌కు వీడ్కోలు చెబుతూ.. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా టాలీవుడ్ నటుడు పెనుమత్స సుబ్బరాజు సంతోష్ సైతం సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బీచ్‌లో తన వైఫ్‌తో కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఫొటోల్లో సుబ్బరాజు దంపతులు పెళ్లిబట్టల్లో కనిపించారు. కొత్త జంటకు పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
సుబ్బరాజు పెళ్లి ఎక్కడ జరిగింది ? అనే వివరాలు తెలియరాలేదు. అలాగే, ఆయన భార్య పేరు.. ఇతర వివరాలు ఏమీ తెలియలేదు. అయితే, సుబ్బరాజు 47 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. గతంలో పలు ఇంటర్వ్యూలలో పెళ్లి ఎప్పుడూ? అని ప్రశ్నిస్తే.. ఆసక్తి లేదంటూ చెప్పేవారు. తాజాగా ఆయన ఓ ఇంటివాడయ్యాడు. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. వెన్నెల కిశోర్‌తో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
సుబ్బరాజు కృష్ణవంశీ దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘ఖడ్గం’ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి ఆయన ఎంట్రీ కాస్త విచిత్రంగానే జరిగింది. కృష్ణవంశీ ఇంటికి కంప్యూటర్ రిపేర్ కోసం వెళ్లిన ఆయనకు అనుకోకుండా ‘ఖడ్గం’లో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలో నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కడంతో ఆ తర్వాత ఆయన వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ నటిస్తున్నారు. ఇప్పటి వరకు వందకుపైగా సినిమాల్లో నటించారు. సుబ్బరాజు స్వస్థలం ఏపీలోని భీమవరం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

