Nayanthara | ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీ విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), తమిళ స్టార్ నటుడు ధనుష్ (Dhanush) మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. నయన్ డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండా ‘నేనూ రౌడీనే’ మూవీలోని మూడు సెకండ్ల క్లిప్పింగ్‌ను వాడుకున్నారంటూ ధనుష్.. నయన్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇక ధనుష్ తీరును తప్పుబడుతూ నయన్ ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. ఆ లేఖపై తాజాగా లేడీ సూపర్ స్టార్ స్పందించారు. అలా చేయడానికి గల కారణాన్ని వెల్లడించారు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్‌కు ధనుష్‌తో వివాదం గురించి ప్రశ్న ఎదురైంది. ‘ధనుష్ గురించి లెటర్ రిలీజ్ చేసేంత ధైర్యం ఎలా వచ్చింది..? ఎక్కడి నుంచి వచ్చింది..?’ అంటూ విలేకరు ప్రశ్నించారు. దీనికి నయన్ స్పందిస్తూ.. ‘తప్పుచేస్తే భయపడాలి కానీ.. న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి భయమెందుకు..? పబ్లిసిటీ కోసం అవతలి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే వ్యక్తిత్వం నాది కాదు. నా డాక్యుమెంటరీ ఫిల్మ్ పబ్లిసిటీ కోసమే ఇలా చేశానని అంతా మాట్లాడుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. వీడియో క్లిప్స్‌కు సంబంధించి ఎన్వోసీ కోసం నేను, విఘ్నేశ్.. ధనుష్‌ను సంప్రదించేందుకు చాలా ట్రై చేశాం. ఎన్నోసార్లు కాల్స్ చేశాం.
మా కామన్ ఫ్రెండ్స్ కూడా ఫోన్స్ చేశారు. ఎంత ప్రయత్నించినా మాకు ఎన్వోసీ రాలేదు. సినిమాలో ఉన్న నాలుగు లైన్ల డైలాగ్‌ను మా డాక్యుమెంటరీలో ఉపయోగించాలనుకున్నాం. ఎందుకంటే ఆ సంభాషణలు మా లైఫ్‌లో ఎంతో ముఖ్యమైనవి అని అనుకున్నాం. ఈ విషయంపై ఆయన మేనేజర్‌ను కూడా సంప్రదించాం. ధనుష్‌తో ఒక్కసారి మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పాం. అటువైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. మరి ధనుష్‌కు నాపై ఎందుకు కోపం వచ్చింది..? ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో ? పక్కవాళ్లు చెప్పిన మాటలు విని అలా చేస్తున్నారా? వంటి విషయాలు తెలుసుకోవడానికి ఆయనతో డైరెక్ట్‌గా మాట్లాడాలనుకున్నాను. కానీ అది జరగలేదు. అయినా ముందు నుంచి మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. ఆయన నాకు మంచి మిత్రుడు. కాకపోతే ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో నాకు తెలీదు’ అని ధనుష్‌తో వివాదంపై నయన్ వివరణ ఇచ్చారు.
విఘ్నేష్ దర్శకత్వంలో వహించిన ‘నానుమ్ రౌడీ దాన్'(2016) సినిమా నయన్ జీవితంలో కీలకం. ఆ సినిమా సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అందుకే అందులోని సన్నివేశాలను, పాటలను డాక్యుమెంటరీలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో.. దానికి సంబంధించిన ఎన్వోసీ(అనుమతి పత్రం) కోసం ఆ చిత్ర నిర్మాతైన హీరో ధనుష్‌ని డాక్యుమెంటరీ మేకర్స్ సంప్రదించారు. రెండేళ్లపాటు పోరాడినా ధనుష్ మాత్రం అందుకు అనుమతి ఇవ్వలేదు. డాక్యుమెంటరీ స్ట్రీమింగ్కి వస్తున్న నేపథ్యంలో రీసెంట్గా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలోని మూడు సెకన్ల క్లిప్స్ ఉండటంతో, అందుకు నష్టపరిహారంగా 10కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ నయనతార టీమ్‌కు ధనుష్ లీగల్ నోటీసులు పంపారు. దాంతో మనసు నొచ్చుకున్న నయనతార.. ధనుష్‌కు భారీ లెటర్ని రాసింది. ఇందులో ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. ఇక నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read..
Heavy Rains | చెన్నైలో కుండపోత.. 11 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు.. అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
Snowfall | జమ్ముకశ్మీర్‌పై మంచు వర్షం.. శ్వేత వర్ణంతో పర్యాటకులను ఆహ్వానిస్తున్న రహదారులు
Pushpa 2 | వెయ్యికోట్ల క్లబ్లో.. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ సునామీ