Snowfall | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) లో మంచు వర్షం (Snowfall) కురుస్తోంది. బారాముల్లా, సోనమార్గ్, బందిపోర (Bandipora) సహా అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో నిరంతరంగా మంచు కురుస్తున్నది. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. స్థానిక ప్రజలు, సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు.
#WATCH | Jammu and Kashmir: Bandipora covered in a blanket of snow as it receives fresh snowfall. pic.twitter.com/5vEbXDCddA
— ANI (@ANI) December 12, 2024
సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచు తెరల మాటు నుంచి కశ్మీర్ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచేగాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు. మంచు వర్షానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి.
#WATCH | Ganderbal, Jammu and Kashmir: Sonamarg covered in a blanket of snow, as the area receives heavy snowfall pic.twitter.com/K7jRe3TUZq
— ANI (@ANI) December 12, 2024
మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి చేరాయి. ఉష్ణోగ్రతలు మైనస్ 1 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు కశ్మీర్ ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.
#WATCH | Jammu and Kashmir: Kupwara covered in a blanket of snow, as the area receives heavy snowfall pic.twitter.com/9HqVmRryyj
— ANI (@ANI) December 12, 2024
#WATCH | Baramulla, J&K: Sopore receives a fresh spell of snowfall. pic.twitter.com/YVMHv9E9pS
— ANI (@ANI) December 12, 2024
#WATCH | J&K: Cold wave grips Kashmir Valley as mercury dips to -1 degrees Celsius. Visuals from Srinagar. pic.twitter.com/LEIbVc3KEz
— ANI (@ANI) December 12, 2024
Also Read..
Rajasthan | 57 గంటలపాటు శ్రమించినా దక్కని ఫలితం.. బోరుబావిలో పడి బాలుడి మృతి
Justice Shekhar Kumar Yadav | వీహెచ్‌పీ సభలో యూసీసీపై వ్యాఖ్యలు అలహాబాద్ హైకోర్టు జడ్జిపై అభిశంసన?
Pollution | పర్యాటక కాలుష్య ఉద్గారాల్లో.. టాప్ 3లో భారత్