Pollution | న్యూఢిల్లీ, డిసెంబర్ 11 : అంతర్జాతీయ, దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాల్లో.. చైనా, అమెరికా, భారత్ దేశాల వాటా అత్యధికంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.పర్యాటక కాలుష్య ఉద్గారాల్లో ఇవి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయని ‘క్వీన్స్లాండ్ వర్సిటీ’ పరిశోధకులు లెక్కగట్టారు. 2009 నుంచి 2019 వరకు పదేండ్లలో 175 దేశాల దేశీయ, అంతర్జాతీయ పర్యాటకం వల్ల గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల్లో పెరుగుదలను అంచనావేశారు.
చైనాలో ఏటా పెరుగుతున్న (17శాతం) దేశీయ పర్యాటకం కారణంగా కాలుష్య ఉద్గారాలు 0.4 గిగాటన్నులు పెరిగిందని, అమెరికా వల్ల 0.2 గిగాటన్నులు, భారత్ వల్ల 0.1 గిగాటన్నులు కాలుష్యం భూ వాతావరణంలోకి చేరిందని అధ్యయనం తెలిపింది. పదేండ్లలో పర్యాటకం వల్ల కాలుష్య ఉద్గారాల విడుదల 3.7 నుంచి 5.2 గిగాటన్నులకు చేరుకుంది.