Heavy Rains | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తమిళనాడు రాజధాని చెన్నై (Chennai)లో కుండపోత వర్షం పడుతోంది. భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు (holiday has been declared for schools).
Non Stop #chennai Rain
Rain doesn’t just wash away the dirt, it also clears the mind#ChennaiRains #HeavyRain #TNRains pic.twitter.com/CEuBl68SJt
— Shiva Yaduvanshi (@Mr_ShivaYadav1) December 12, 2024
చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విళ్లుపురం, కళ్లకురిచ్చి, రామనాథపురం, అరియలూరు, కడలూరు, కరైక్కల్, తిరుచ్చి, నాగపట్టణం, కోయంబత్తూర్ సహా తదితర జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పలు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలాదుతురై, పుదుక్కోట్టై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువావూర్, రాణిపేట్, తిరువళ్లూరు జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చారు.
Heavy rain in Chennai #ChennaiRainspic.twitter.com/iEYSlW11ie
— ⚜️🔱🚩Crypto சங்கி🇮🇳 – Say No To Drugs & DMK (@crypto_sanghi) December 11, 2024
ఇక ఇవాళ ఉదయం తూత్తుకుడిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరోవైపు పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వేలూరు, పెరంబూర్, సేలం, నమక్కల్, శివగంగ, మదురై, దిండిగల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా తూత్తుకుడి, తెన్కాసి, తెని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
#ChennaiRains back 🫡 pic.twitter.com/5QSFlybtEy
— OMR Updates (@OMRupdates) December 11, 2024
Also Read..
Snowfall | జమ్ముకశ్మీర్‌పై మంచు వర్షం.. శ్వేత వర్ణంతో పర్యాటకులను ఆహ్వానిస్తున్న రహదారులు
Mohan Babu | మీడియాపై దాడి.. మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు
Avanthi Srinivas | జగన్‌కు అవంతి శ్రీనివాస్ షాక్.. వైసీపీకి మాజీ మంత్రి గుడ్‌బై!