KU PG Exams | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 16: కాకతీయ విశ్వవిద్యాలయ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షా టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి శ్రీనివాస్ విడుదల చేశారు. మొదటి పేపర్ 25న, రెండో పేపర్ 27న, మూడో పేపర్ మార్చి 2న, నాల్గవ పేపర్ 5న, ఐదో పేపర్ 7న, ఆరో పేపర్ 9న ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య జరుగుతాయన్నారు.
కేయూ ఎంసీఏ మొదటి సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ ను పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసిం ఇక్బాల్ విడుదల చేశారు. మొదటి పేపర్ 26న, రెండో పేపర్ 28న, మూడో పేపర్ మార్చి 4న, నాల్గవ పేపర్ 6న, ఐదో పేపర్ 9న ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు.
కేయూ ఎంబీఏ మొదటి సెమిస్టర్ మొదటి పేపర్ 26న, రెండో పేపర్ 28న, మూడో పేపర్ మార్చి 4న, నాల్గవ పేపర్ 6న, ఐదో పేపర్ 9న, ఆరో పేపర్ 11న, ఏడో పేపర్ 13న ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని వారు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.kakatiya.ac.in చూడాలని వారు తెలిపారు.
Peddapalli | కోరం లేక వాయిదా పడ్డ సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నిక
‘ఎంజీయూ విద్యార్థులకు కనీస వైద్య సదుపాయాలు కరువు’