Anil Kurmachalam | యువత పోరాట ఫలితమే కేంద్ర మంత్రి రాజీనామా : అనిల్ కూర్మాచలం
Anil Kurmachalam | దేశ యువత పోరాటానికి దిగొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారని బీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు,ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం అన్నారు.
దేశ యువత పోరాటానికి దిగొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా ( Minister Resign ) చేశారని బీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు,ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ( Anil Kurmachalam ) అన్నారు. మంత్రి రాజీనామా ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం, నైతిక బాధ్యత, ప్రజల అభిప్రాయానికి ఇచ్చే గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇది వ్యక్తులపై విజయం కాదని. ప్రజాస్వామ్య విలువలపై ప్రజల విశ్వాసానికి లభించిన గౌరవంగా చూడాలని వెల్లడించారు.
దేశ భవిష్యత్తును నిర్మించేది యువశక్తేనని వివరించారు. అన్యాయం, అవినీతి, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన అంశాలపై యువత రాజ్యాంగబద్ధంగా స్పందించడం ఆరోగ్యకరమైన సంకేతమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, రాజ్యాంగ బద్ధంగా పోరాడే సంకల్పం ఉంటే ఎంతటి ప్రభుత్వాన్నైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించేలా చేయవచ్చని నేటి యువత దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందన్నారు.
ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా వ్యవహరిస్తూ, ప్రజల సమస్యలు, అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. దేశ నిర్మాణంలో యువత మరింత చురుకైన పాత్ర పోషించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతతో ముందుకు రావాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

