Nayanthara | ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీ విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ విషయంలో నయన్ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నయన్ డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండా ‘నేనూ రౌడీనే’ మూవీలోని మూడు సెకండ్ల క్లిప్పింగ్‌ను వాడుకున్నారంటూ తమిళ స్టార్ ధనుష్ రూ.10 కోట్లకు దావా వేశారు. తాజాగా ‘చంద్రముఖి’ నిర్మాతలు (Chandramukhi makers) కూడా నయన్‌కు లీగల్ నోటీసులు (legal notice) ఇచ్చారు. చంద్రముఖి చిత్రంలోని కొన్ని క్లిప్పింగ్స్‌ను అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో వాడుకున్నారంటూ చిత్ర నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్‌తోపాటు నయన్‌కు నోటీసులు జారీ చేశారు. రూ.5 కోట్లు పరిహారం కింద చెల్లించాలని అందులో డిమాండ్ చేశారు. ఈ నోటీసులపై నయన్ ఇంకా స్పందించలేదు.
కాగా, నయన్.. ధనుష్ మధ్య గతకొంత కాలంగా వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు. ఆ క్లిప్పింగ్‌ను డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ధనుష్‌ని లక్ష్యంగా చేసుకొని నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. చట్టపరంగా తేల్చుకుంటానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ధనుష్ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
“Nayanthara | ధనుష్‌తో వివాదం.. నయనతారకు మద్రాసు హైకోర్టు నోటీసులు”
“Nayanthara | నేనెందుకు భయపడాలి..?.. ధనుష్‌తో వివాదంపై నయనతార కామెంట్స్”
“Nayanthara | వడ్డీతో సహా తిరిగొస్తుంది.. ధనుష్‌ను ఉద్దేశించి నయనతార పోస్ట్!”
“Nayanthara | ఎలాంటి ఉల్లంఘనా జరగలేదు.. ధనుష్ లీగల్ నోటీసులపై స్పందించిన నయనతార లాయర్”
“Dhanush | డాక్యుమెంటరీ వివాదంపై కోర్టును ఆశ్రయించిన ధనుష్.. నయన్ దంపతులపై దావా”
“Dhanush | నయనతారతో వివాదం తర్వాత ధనుష్ తొలి పోస్ట్..! ఇంతకీ ఏమన్నారంటే..?”