Nayanthara | వడ్డీతో సహా తిరిగొస్తుంది.. ధనుష్‌ను ఉద్దేశించి నయనతార పోస్ట్!
దక్షిణాది సినీరంగంలో నయనతార-ధనుష్ మధ్య నెలకొన్న వివాదం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే నయనతార జీవితం ఆధారంగా రూపొందించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ విషయంలో మొదలైన వివాదం మరింత జటిలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Nayanthara | దక్షిణాది సినీరంగంలో నయనతార-ధనుష్ మధ్య నెలకొన్న వివాదం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే నయనతార జీవితం ఆధారంగా రూపొందించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ విషయంలో మొదలైన వివాదం మరింత జటిలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని ఉదహరిస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో నయనతార పెట్టిన పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘కర్మ సిద్ధాంతం ఏం చెబుతుందంటే.. అబద్ధాలతో పక్కవారి జీవితాన్ని నువ్వు ధ్వంసం చేస్తే.. దానిని ఓ అప్పుగా భావించు. అది సరైన సమయంలో వడ్డీతో సహా నీ దగ్గరకే వస్తుంది’ అంటూ నయనతార తన పోస్ట్‌లో పేర్కొంది. ధనుష్‌ను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్‌ను పెట్టిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ధనుష్-నయనతార వివాదం పూర్వపరాల్లోకి వెళితే.. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో నయనతార నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా వీడియోలను కొన్నింటిని వాడుకున్నారు.
ఈ సినిమా సమయంలో దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో ప్రేమలో పడింది నయనతార. అందుకే ఆ సినిమా క్లిప్స్‌ను తన డాక్యుమెంటరీలో ఉపయోగించుకోవాలని భావించింది నయనతార. అందుకు చిత్ర నిర్మాత ధనుష్ నుంచి అనుమతి లభించలేదు. మూడు సెకన్ల పాటు వాడిన వీడియో క్లిప్‌ను తీసివేయాలని, లేకుంటే పరిహారంగా 10కోట్లు చెల్లించాలని నయనతారకు ధనుష్ లీగల్ నోటీసులు పంపించాడు. దీనితో ఆగ్రహం చెందిన నయనతార.. ధనుష్ తీరును తప్పుబడుతూ ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. అక్కడ మొదలైన వివాదం ధనుష్ వరుసగా ఇస్తున్న కోర్టు నోటీసులతో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పరోక్షంగా ధనుష్‌ను ఉద్దేశించి నయన్ ఈ పోస్ట్ పెట్టిందని చెన్నై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

