Nayanthara | ఎలాంటి ఉల్లంఘనా జరగలేదు.. ధనుష్ లీగల్ నోటీసులపై స్పందించిన నయనతార లాయర్
Nayanthara | ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీ విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), తమిళ స్టార్ నటుడు ధనుష్ (Dhanush) మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
Nayanthara | ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీ విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), తమిళ స్టార్ నటుడు ధనుష్ (Dhanush) మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. నయన్ డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండా ‘నేనూ రౌడీనే’ మూవీలోని మూడు సెకండ్ల క్లిప్పింగ్‌ను వాడుకున్నారంటూ ధనుష్.. నయన్ దంపతులపై మద్రాసు హైకోర్టులో రెండు రోజుల క్రితం దావా వేశారు. దీనిపై నయన్ తరఫు లాయర్ తాజాగా స్పందించారు. డాక్యుమెంటరీలో ఎలాంటి కాపీరైట్ ఉల్లంఘనా జరగలేదని స్పష్టం చేశారు.
డాక్యుమెంటరీలో వినియోగించిన విజువల్స్ సినిమాలోనివి కావని తెలిపారు. అవి బీటీఎస్‌కు సంబంధించినవని స్పష్టం చేశారు. అది వ్యక్తిగత లైబ్రరీలో భాగం అని తెలిపారు. కాబట్టి అది ఉల్లంఘన కిందకు రాదని ఓ ఆంగ్ల మీడియాతో అన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టులో తదుపరి విచారణ డిసెంబర్ 2న (సోమవారం) జరగనుంది.
కాగా, నయన్.. ధనుష్ మధ్య గతకొంత కాలంగా వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు. ఆ క్లిప్పింగ్‌ను డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ధనుష్‌ని లక్ష్యంగా చేసుకొని నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. చట్టపరంగా తేల్చుకుంటానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ధనుష్ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
Samantha | సిటాడెల్ సక్సెస్ పార్టీ.. బేబీ జాన్ పాటకు సామ్ – వరుణ్ ధావన్ స్టెప్పులు.. VIDEO
Naga Chaitanya – Sobhita | మొదలైన పెళ్లి సందడి.. నాగచైతన్య – శోభిత హల్దీ వేడుకలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

