Naga Chaitanya – Sobhita | మొదలైన పెళ్లి సందడి.. నాగచైతన్య – శోభిత హల్దీ వేడుకలు
Naga Chaitanya – Sobhita | అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. తాజాగా కాబోయే కొత్త జంటకు హల్దీ వేడుకలు (Haldi Ceremony) నిర్వహించారు.
Naga Chaitanya – Sobhita | అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన పెద్ద కుమారుడు నాగచైతన్య (naga chaitanya) వివాహం శోభితా ధూళిపాళ్ల (sobhita dhulipala)తో డిసెంబర్ 4న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కాబోయే కొత్త జంటకు హల్దీ వేడుకలు (Haldi Ceremony) నిర్వహించారు. చై-శోభిత జంటను ఒకేచోట ఉంచి మంగళస్నానాలు చేయించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకల్లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియో వీరి పెళ్లికి వేదిక కానుంది. తమ రిలేషన్‌షిప్‌పై గత ఏడాది కాలంగా గోప్యత పాటించిన ఈ జంట ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరుపుకొని అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్నిచ్చారు. ఇదిలా వుండగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శోభితా ధూళిపాళ్లతో తన పరిచయం, ఆమె కుటుంబ సభ్యులతో ఏర్పడిన అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు చైతూ. ముంబయిలో జరిగిన ఒక ఓటీటీ షో సందర్భంగా తామిద్దరం తొలిసారిగా కలుసుకున్నామని చైతూ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ‘మా ఇద్దరి పరిచయం అనుకోకుండా జరిగిపోయింది. ఫస్ట్ మీటింగ్‌లో చాలా సరదాగా మాట్లాడుకున్నాం. కొన్ని నెలల వ్యవధిలోనే మా మధ్య బంధం బలపడింది. ఆ తర్వాత మా ఇద్దరి ఫ్యామిలీస్ చాలా సార్లు కలిశాయి’ అని చెప్పారు నాగచైతన్య. శోభితా కుటుంబం సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యతనిస్తుందని, తనను వారు ఓ కొడుకులా ట్రీట్ చేస్తారని నాగచైతన్య చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోతో తమ కుటుంబానికి భావోద్వేభరితమైన అనుబంధం ఉందని, అక్కడ పెళ్లి చేసుకోవడం చాలా ప్రత్యేకంగా భావిస్తున్నానని నాగచైతన్య తెలిపారు.
Also Read..
Ajithkumar | నో డైలాగ్స్.. ఓన్లీ యాక్షన్.. విదాముయార్చి టీజర్‌తో హైప్ పెంచేస్తున్న అజిత్‌కుమార్
Bloody Beggar | బ్లడీ బెగ్గర్ ఓటీటీలోకి వచ్చేశాడు.. కవిన్ సందడి చేసే పాపులర్ ప్లాట్‌ఫాం ఇదే
Suriya 44 | సూర్య 44 స్పెషల్ సాంగ్ వచ్చే టైం చెప్పిన శ్రియా శరణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

