Suriya 44 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్న సూర్య 44 (Suriya 44). = బాలీవుడ్ భామ పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. చాలా రోజుల క్రితం అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు కాగా.. ఈ మూవీ చిత్రీకరణ కొనసాగుతోంది.
కాగా ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఇప్పటికే వార్త ఒకటి తెరపైకి వచ్చింది. తాజాగా శ్రియా ఈ పాటపై క్లారిటీ ఇచ్చేసింది. గోవాలో ఐఫా-2024 ఈవెంట్లో శ్రియా శరణ్ మాట్లాడుతూ.. కార్తీక్ సుబ్బరాజు, సూర్య ప్రాజెక్టులో భాగం కావడం చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది. ఈ చిత్రంలో నేను చేసిన స్పెషల్ సాంగ్ డిసెంబర్లో రాబోతుందని తెలిపింది.
ఈ పాటను గోవాలో వేసిన స్పెషల్ సెట్లో చిత్రీకరించినట్టు కోలీవుడ్ సర్కిల్ సమాచారం. యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నాడు. సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీరియాడిక్ వార్ అండ్ లవ్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రానికి తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్ డీవోపీగా వర్క్ చేస్తున్నాడు.
Shriya Saran About #Suriya44#ShriyaSaran #suriya pic.twitter.com/iuk4TyX43v
— AR Entertainment (@ARMedia28524249) November 28, 2024
THE PARADISE | నానితో కలెక్షన్ కింగ్ ఫైట్.. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ క్రేజీ న్యూస్..!
Kiran Abbavaram | ఓటీటీలో కిరణ్ అబ్బవరం క చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Jailer 2 | తలైవా బర్త్ డే స్పెషల్.. జైలర్ 2 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్