Ajithkumar | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి విదాముయార్చి (Vidaa Muyarchi). ఏకే 62గా వస్తోన్న ఈ మూవీకి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు. ఆరవ్ మరో కీ రోల్ చేస్తున్నాడు.
కాగా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ రానే వచ్చింది. స్టైలిష్ యాక్షన్ పార్టుతో సాగుతున్న టీజర్ మంచి ఇంప్రెషన్ కొట్టేస్తుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా నో డైలాగ్స్.. ఓన్లీ యాక్షన్ అన్నట్టుగా సాగుతుంది టీజర్. లీడ్ యాక్టర్లందరిపై వచ్చే సన్నివేశాలతో కట్ చేసిన టీజర్.. సినిమా ఏదో మిస్టీరియస్ ఎలిమెంట్ చుట్టూ ఉండబోతుందని హింట్ ఇచ్చేస్తుంది.
మొత్తానికి అజిత్ కుమార్ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు టీజర్ చూసిన సినీ జనాలు. . లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే షేర్ చేసిన విదాముయార్చి పోస్టర్లు అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
విదాముయార్చి టీజర్..
Bloody Beggar | బ్లడీ బెగ్గర్ ఓటీటీలోకి వచ్చేశాడు.. కవిన్ సందడి చేసే పాపులర్ ప్లాట్‌ఫాం ఇదే
THE PARADISE | నానితో కలెక్షన్ కింగ్ ఫైట్.. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ క్రేజీ న్యూస్..!
Jailer 2 | తలైవా బర్త్ డే స్పెషల్.. జైలర్ 2 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్