Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) తాజాగా హిందీ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో సామ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan) కథానాయకుడిగా నటించారు. ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా చిత్రబృందం సిటాడెల్ సక్సెస్ పార్టీని (Citadel success party) గత రాత్రి ముంబైలో ఘనంగా నిర్వహించింది. ఈ పార్టీలో సామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
varun and samantha dancing on nain matakka song, damn i’m obsessed 😭🔥 pic.twitter.com/NW65HBPxN9
— Annesha (@ApnaaVarun) November 28, 2024
వరుణ్ ధావన్ నటిస్తున్న ‘బేబీ జాన్’ (Baby John) చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన ‘నైన్ మాటక్క’ అనే పాటకు సామ్ కాలు కదిపింది. వరుణ్‌తో కలిసి ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక అదే సమయంలో సక్సెస్ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా సమంత ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం అవి కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సమంత ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యాక్షన్ సిరీస్ ‘ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny). ఇందులో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు రీమేక్‌గా ఈ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 7 నుంచి విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ మరియు కష్వీ మజ్ముందర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇక వరుణ్ ధావన్ నటిస్తున్న తాజా చిత్రం ‘బేబీ జాన్’. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ లీడ్‌రోల్స్ చేస్తున్నారు. మురాద్ ఖేతా, ప్రియా అట్లీ, జ్యోతిదేశ్‌పాండే నిర్మాతలు. కలీస్ దర్శకుడు. జియో స్టూడియోస్‌తో కలిసి అగ్ర దర్శకుడు అట్లీ సమర్పిస్తున్నారు. డిసెంబర్ 25న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read..
Naga Chaitanya – Sobhita | మొదలైన పెళ్లి సందడి.. నాగచైతన్య – శోభిత హల్దీ వేడుకలు
Ajithkumar | నో డైలాగ్స్.. ఓన్లీ యాక్షన్.. విదాముయార్చి టీజర్‌తో హైప్ పెంచేస్తున్న అజిత్‌కుమార్