Pushpa 2 The Rule | టాలీవుడ్, పాన్ ఇండియా మూవీ లవర్స్‌తోపాటు తెలుగు సినిమాలను లైక్ చేసే గ్లోబల్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి టైటిల్ రోల్లో నటిస్తుండగా.. కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న నేపథ్యంలో బన్నీ టీం పాన్ ఇండియా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా అఫీషియల్‌గా సెన్సార్ అప్డేట్ వచ్చేసిందని తెలిసిందే. అయితే పుష్ప 2 ది రూల్ రన్ టైంపైనే ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ చర్చ నడుస్తుంది. ఈ మూవీ రన్‌టైం 3 గంటల 20 నిమిషాలు.
ఆడియెన్స్ ఇప్పటికే పుష్ప ది రైజ్‌ను 2 గంటల 59 నిమిషాలపాటు ఓపికగా చూసి పుష్పరాజ్ మేనియాను థియేటర్లలో ఫుల్ ఎంజాయ్ చేశారని తెలిసిందే. మరి రెండోపార్టు వచ్చేసరికి అదనంగా మరో 21 నిమిషాలు యాడ్ అయింది. ఇది లాంగ్ రన్ టైం కాగా.. మరి సుకుమార్ తన టాలెంట్‌తో ప్రేక్షకులను సీట్లపై నుంచి లేవకుండా కూర్చొబెట్టేస్తాడా..? అంటూ నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.
కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు బోరుగా ఫీలవకుండా సీట్లకు అతుక్కుపోవడం చూస్తుంటాం. మరి పుష్ప సీక్వెల్ విషయంలో ఎలాంటి రిజల్ట్ ఉండబోతుందనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
సీక్వెల్ కోసం రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది.
#Pushpa2TheRule – 3 Hrs 20 Min 38 Secs ⏳🔥🔥#Pushpa2TheRule #Pushpa@alluarjun @aryasukku @pushpamovie @mythriofficial#Pushpa2 #AlluArjun #Sukumar pic.twitter.com/oaHuJwam60
— Thyview (@Thyview) November 28, 2024
THE PARADISE | నానితో కలెక్షన్ కింగ్ ఫైట్.. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ క్రేజీ న్యూస్..!
Kiran Abbavaram | ఓటీటీలో కిరణ్ అబ్బవరం క చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Jailer 2 | తలైవా బర్త్ డే స్పెషల్.. జైలర్ 2 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్