Dhanush | నెట్‌ఫ్లిక్స్‌లో నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ డాక్యుమెంటరీ ఆలస్యమయ్యేందుకు కారణం ధనుష్ అంటూ లేడిసూపర్ స్టార్ ఆరోపించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలువురు హీరోయిన్లు మద్దతు ప్రకటించగా.. అభిమానులు ధనుష్‌కు సపోర్ట్ చేశారు. ధనుష్‌పై విమర్శలు చేసినందుకు నయనతారపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నయన్ ఆరోపణలపై ధనుష్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, వివాదం తర్వాత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆయన దర్శకత్వంలో ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ చిత్రం తెరకెక్కిస్తుండగా.. పోస్టర్‌ను విడుదల చేశారు. విశేషం ఏంటంటే స్టోరీ రాసింది కూడా ఆయనే.
మూవీ నుంచి ‘కాదల్ ఫెయిల్’ సెకండ్ సింగిల్‌ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. మాథ్యూ థామస్, ప్రియా ప్రకాష్ వారియర్, అనిఖా సురేంద్రన్, రబియా ఖాతూన్, పవిష్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. అయితే, నయనతార బహిరంగ లేఖపై ధనుష్ ఎలా స్పందిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ వివాదంపై మిన్నకుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. లేడి సూపర్‌స్టార్ విమర్శలను ధనుష్ ఏమాత్రం పట్టించుకోలేదని.. ప్రస్తుతం ఆయన కేవలం పనిపైనే దృష్టి సారిస్తున్నారంటూ పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. చిత్రంలో పాట కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు.
వివాదాలను విస్మరించి కెరీర్‌పై దృష్టి పెట్టడం ఎలాగో మీ నుంచి నేర్చుకోవాల్సిందే. ఇందుకు ఉదాహరణ మీరే అంటూ మరో యూజర్ పేర్కొన్నారు. వాస్తవానికి నయనతార తన డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ ధాన్’ చిత్రంలోని సన్నివేశాలను ఉపయోగించుకునేందుకు ధనుష్ అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. ట్రైలర్లో ఉపయోగించిన మూడు సెకన్ల వీడియో కోసం రూ.10కోట్లకు లీగల్ నోటీస్ పంపించారని ఆరోపించారు. తాను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సింగిల్ ఉమెన్‌గా ఇండస్ట్రీకి వచ్చానని.. ఛాలెంజింగ్‌గా హార్డ్ వర్క్, డెడికేషన్‌తో ప్రస్తుత పరిస్థితికి చేరుకున్నానని.. నా పాజిటివ్ జర్నీపై అభిమానులకు, నన్ను ప్రేమించే సినీ వర్గాలకు బాగా తెలుసునని చెప్పింది. అభిమానులు, శ్రేయోభిలాషులు డాక్యుమెంటరీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పింది.
ప్రేమ, పెళ్లితో సహా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను చూపించే ఈ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ మూవీ ప్రస్తావన ఎక్కువగా లేకపోవడం బాధాకరమని పేర్కొంది. సినిమాలోని క్లిప్పింగ్స్, పాటలు, ఫొటోలను ఉపయోగించుకునేందుకు ధనుష్ నుంచి ఎన్ఓసీ కోసం రెండేళ్లు ఎదురుచూశామని.. అయినా నిరాశే ఎదురైందని చెప్పింది. ట్రైలర్లో ఉపయోగించిన 3 సెక్‌ల వీడియోపై నోటీసులు పంపడం షాకింగ్ ఉందని.. ప్రైవేట్ వీడియో సన్నివేశానికి రూ.10కోట్లు డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని పేర్కొంది. తన డాక్యుమెంటరీని అడ్డుకునేందుకు ధనుష్ ప్రయత్నించాడంటూ ఆరోపించింది.
#Neek second single is a Gen-z soup song “ kadhal fail “ pic.twitter.com/aMnebMf0W9
— Dhanush (@dhanushkraja) November 20, 2024
#Neek second single is a Gen-z soup song “ kadhal fail “ pic.twitter.com/aMnebMf0W9
— Dhanush (@dhanushkraja) November 20, 2024