తాండూర్ : మహిళల భద్రత కోసమే షీ టీమ్స్ ( She Teams ) పనిచేస్తున్నాయని మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఇన్చార్జి ఎస్సై ఉషారాణి ( Usharani) అన్నారు. మండలంలోని రేచిని జడ్పీహెచ్ఎస్ లో విద్యార్థులకు డ్రగ్స్, షీ టీమ్ మీద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
మహిళా చట్టాలు, డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలు, షీ టీమ్ ప్రాముఖ్యత , మానవ అక్రమ రవాణా, పోక్సో చట్టాలు, బాల్య వివాహాలు దాని పరిణామాల గురించి, ఈవ్ టీజింగ్, టీ సేఫ్ అప్లికేషన్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్స్, సైబర్ హెల్ప్ లైన్ నంబర్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజ రుగ్మతల గురించి వివరించారు.
ఎవరైనా మహిళలను వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100 , రామగుండం షీ టీమ్ నెంబర్ 6303923700 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ కానిస్టేబుల్స్ శ్రవణ్, జ్యోతి, పాఠశాల హెడ్ మాస్టర్ ప్రదీప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.