G2 | టాలీవుడ్ యాక్టర్ అడివిశేష్ (Adivi Sesh) కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోతుంది టైటిల్ రోల్ పోషించిన గూడఛారి. ఈ ప్రాంఛైజీలో జీ2 (G2) కూడా వస్తుందని తెలిసిందే. మేజర్ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా గన్స్ యాక్షన్ మూడ్‌లోకి దిగితే.. అంటూ ఇప్పటికే సినిమాపై సూపర్ క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.
తాజాగా ఈ చిత్ర టీంలోకి బేబిజాన్ నటి వామికా గబ్బి వచ్చేసింది. మిషన్‌లో భాగంగా సూట్లో ఉన్న అడివిశేష్, వామికా ఈఫిల్ టవర్ ముందు కనిపిస్తుండటం తాజా లుక్‌లో చూడొచ్చు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన జీ2 (G2) ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు ప్రీ వెర్షన్ అనౌన్స్ మెంట్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది. అడివి శేష్‌ను సీక్వెల్లో స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో చూపిపించబోతున్నట్టు ప్రీ వెర్షన్ అనౌన్స్ మెంట్ వీడియోతో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. జీ2 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ విడుదల కానుంది.
Team #G2 welcomes the brilliant #WamiqaGabbi on board for the mission ❤🔥
Get ready for adrenaline pumping action in a breathtaking adventure 💥💥
Stay tuned for THE THUNDER GLIMPSE this month⚡❤️🔥#Goodachari2@AdiviSesh @emraanhashmi @vinaykumar7121 @peoplemediafcy… pic.twitter.com/1nYaEzNzqx
— BA Raju’s Team (@baraju_SuperHit) January 7, 2025
Toxic | హాలీవుడ్ స్టైల్లో యశ్ బాస్.. టాక్సిక్ ఫస్ట్ లుక్ లాంచ్ టైం ఫిక్స్
Maharaja | చైనా బాక్సాఫీస్నూ వదలని విజయ్‌సేతుపతి.. మహారాజ అరుదైన రికార్డ్
Pushpa 2 The Rule | బాహుబలి 2 రికార్డ్ బ్రేక్.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఇవే