Toxic | కేజీఎఫ్ ప్రాంఛైజీ తర్వాత కన్నడ స్టా్ర్ హీరో యశ్ (Yash) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం టాక్సిక్ (Toxic). పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ A Fairy Tale For Grown Ups ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. యశ్ 19వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కే నారాయణ తెరకెక్కిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తను షేర్ చేశాడు యశ్.
టాక్సిక్ ఫస్ట్ లుక్‌ను జనవరి 8న లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వింటేజ్ టాక్సీ, రౌండప్ క్యాప్ పెట్టుకున్న యశ్ ప్రీ లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి, తారా సుటారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
బ్రదర్-సిస్టర్ కథతో 1970స్ గోవా, కర్ణాటక బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా సాగనుందని ఇన్సైడ్ టాక్. కథానుగుణంగా బెంగళూరు, శ్రీలంకలో టాక్సిక్ షూటింగ్ కొనసాగించనున్నట్టు ఇన్సైడ్ టాక్. కేజీఎఫ్ ప్రాంఛైజీ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్టు తర్వాత యశ్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
Unleashing him… pic.twitter.com/yspMrqBBmo
— Yash (@TheNameIsYash) January 6, 2025
టాక్సిక్ గ్లింప్స్ వీడియో..
Game Changer | గేమ్ ఛేంజర్‌లో ఈవెంట్లో విషాదం.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన దిల్ రాజు
Nara Brahmani | మణిరత్నం సినిమాకి బాలకృష్ణ కూతురు ఎందుకు నో చెప్పిందంటే.?