Koti Talambralu | రాయపోల్, మార్చి 15 : భద్రాచల సీతారాముల కళ్యాణంలో గోటి తలంబ్రాలే వాడతారని భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు అన్నారు.
ఈ తలంబ్రాల దీక్ష కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా రాయిపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామంలో రామాలయ కమిటీ ఆధ్వర్యంలో 16-3-2026 రోజు (సోమవారం) 108 కలశాలతో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం ఉంటుందని.. దీనికి సంబందించిన కరపత్రాలను రామకోటి రామరాజు ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇతర గ్రామాల భక్తులు కూడా ఈ కార్యక్రమంలో ఓల్గొన వచ్చన్నారు. గోటి తలంబ్రాల కార్యక్రమంలో స్త్రీ, పురుష లింగ భేదం లేకుండా అందరు పాల్గొనాలన్నారు. మనం లేకున్నా మనం ఒలిచే తలంబ్రాలు కళ్యాణంలో ఉంటే బహు పుణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.