Suma Kanakala | యాంకర్ సుమకు గజమాలతో ఘన సన్మానం.. జీవిత సాఫల్య పురస్కారంలా అనిపించిందంటూ కామెంట్
Suma Kanakala | తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేకమైన యాంకరింగ్ శైలితో రెండు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ప్రముఖ యాంకర్ సుమ కనకాలకు భీమవరంలో ఘన సత్కారం జరిగింది. వందలాది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, టీవీ షోలు, ప్రత్యేక కార్యక్రమాలను తనదైన స్టైల్లో విజయవంతంగా నడిపించిన సుమకు తాజాగా సినిమా వేదికపై జరిగిన ఈ సన్మానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Suma Kanakala | తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేకమైన యాంకరింగ్ శైలితో రెండు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ప్రముఖ యాంకర్ సుమ కనకాలకు భీమవరంలో ఘన సత్కారం జరిగింది. వందలాది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, టీవీ షోలు, ప్రత్యేక కార్యక్రమాలను తనదైన స్టైల్లో విజయవంతంగా నడిపించిన సుమకు తాజాగా సినిమా వేదికపై జరిగిన ఈ సన్మానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భీమవరంలో అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా ఎప్పటిలాగే యాంకర్ సుమ హోస్ట్గా వ్యవహరించి తన చమత్కారమైన మాటలతో ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమం ముగిసిన తర్వాత మూవీ టీమ్ సుమకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది.
ఈవెంట్ ముగిసిన అనంతరం హీరో వరుణ్ తేజ్, సంగీత దర్శకుడు ఎస్. థమన్ కలిసి వేదికపై సుమను ప్రత్యేకంగా సన్మానించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా వందలాది ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఒంటిచేత్తో విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నందుకు గాను ఆమెకు శాలువా కప్పి, భారీ గజమాలను వేసి ఘనంగా సత్కరించారు.అనూహ్యంగా గజమాలతో సన్మానం చేయడంతో సుమ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తనదైన హాస్యశైలిని ఏమాత్రం వదలకుండా, “కేవలం శాలువాలేనా… గిఫ్ట్ ఏదైనా ఉందా?” అంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
సన్మానం అనంతరం మాట్లాడిన సుమ తనదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. ఇది నాకు జీవిత సాఫల్య పురస్కారంలా అనిపిస్తోంది. అయితే నెక్స్ట్ టైం ఇలా గజమాలతో ప్లాన్ చేస్తే పువ్వులకు బదులు పుదీనాతో చేయించండి. రేపు ఇంట్లో చట్నీకి పనికొస్తుంది. ఈ పూలు అయితే వాడిపోతాయి అంటూ చెప్పడంతో వేదికపై ఉన్నవారంతా పగలబడి నవ్వారు. అదే సమయంలో భీమవరంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని కూడా సుమ గుర్తు చేసుకున్నారు. చాలా ఏళ్ల క్రితం భీమవరంలోని మావుళ్లమ్మ జాతరలో నాకు సన్మానం చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇదే భీమవరంలో మరోసారి ఇలా సత్కారం జరగడం అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాను అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

