Karthik Subbaraj | కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన కెరీర్లో 10వ మైలురాయిగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమాకు ‘డోరతి’ (Dorothy) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సనాంత్, రిషికాంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇది తన మనసుకు చాలా దగ్గరైన కథ అని, ఎంతో కాలంగా తాను తెరకెక్కించాలనుకున్న ఈ సినిమా ఎట్టకేలకు నెరవేరిందని తెలిపారు. అది కూడా సంగీత మాంత్రికుడు ఇళయరాజా సంగీత దర్శకత్వంలో చేయడం తన జీవితంలో మరువలేని అనుభూతి అని పేర్కొన్నారు. ఈ సినిమా ప్రఖ్యాత టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో వరల్డ్ ప్రీమియర్‌గా అధికారికంగా ఎంపికైంది. జియో స్టూడియోస్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ధమ్మమ్ ఫిలిమ్స్ కూడా ఈ నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి గణేష్ శివ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25, 2026 న ప్రపంచవ్యాప్తంగా భారీ థియేట్రికల్ విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
My Tenth film is DOROTHY ❤️
Starring Keerthy Suresh, Sananth and Rishikanth 💥
A Story that is very very close to my heart and a Film I wanted to make since many years is Finally made… and that too with Music by The Maestro Ilaiyaraaja sir 🙏🏻🙏🏻
And It’s Officially selected… pic.twitter.com/W4zI8zuKEZ
— karthik subbaraj (@karthiksubbaraj) August 4, 2026